హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్టబద్ధంగా, సమయానుకూలంగా పరిష్కరించాలని ఆదేశించారు. సాంకేతిక లేదా న్యాయపరమైన సమస్యలు ఉంటే బాధితులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు.