ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్ వద్ద మాజీ సైనికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. MS-1241/27/10/2008 జీవో ప్రకారం మాజీ సైనికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తమ చిరకాల కోరిక అయిన సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ వద్ద మాజీ సైనికుల నిరసన


