హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవదుర్గ ఆలయంలో భక్తుల సందడి

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయాన్నే శివలింగాన్ని విశేషంగా అలంకరించి పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.