హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం

AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ సీడీపీవో రమణి ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసించే చిన్నారుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను ట్రైనర్లు వివరించారు. పౌష్టికాహార విలువలను తల్లులకు వివరించాలని పేర్కొన్నారు. ఆటపాటలతో బాలబాలికలను ఆకట్టుకునే విధానాన్ని నేర్పారు.