SDPT: జిల్లాకు చెందిన రైతాంగ ఉద్యమ నేత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతులు, కూలీల సంక్షేమం కోసం ఆయన సాగించిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. మల్లారెడ్డి అకాల మరణం వామపక్ష రంగానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మల్లారెడ్డి మరణం ఉద్యమానికి లోటు: పొన్నం


