NLR: కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో చోరీ జరిగింది. వివాహం నిమిత్తం ఇంటి యజమాని దాసరి మురళి కుటుంబంతో కలిసి ఊరు వెళ్లగా, దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి సుమారు రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును అపహరించారు. ఇంటి యజమాని ఊరు వెళ్లిన రెండు గంటల్లోపే చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కోవూరు ఎస్సై ముత్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చోరీకి గురైన రూ.5 లక్షల విలువైన బంగారం


