BHNG: సాధారణంగా రాళ్లంటే నిశ్శబ్దంగానే ఉంటాయి. కానీ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కనిపిస్తున్న కొన్ని సహజసిద్ధమైన రాళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా తట్టినప్పుడు గంట మోగినట్టుగా స్పష్టమైన ధ్వని వినిపిస్తుండటంతో స్థానికులు, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో రాయిని తట్టినప్పుడు ఒక్కో రకమైన శబ్దం రావడంతో ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ
సంగీత శిలలు.. తట్టితే ఒక్కో రాయిది ఒక్కో స్వరం


