హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో ఘనంగా రక్తదాన శిబిరం

VKB: ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పరిగిలోని కుతుబ్ షాహీ జమా మస్జిద్‌లో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు ఖాజీ ఖాజా అజరుద్దీన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రక్తదానం అత్యున్నత మానవ సేవ అని మానవత్వం చాటుకున్నారు.