హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక లారీ ఢీకొని మహిళా అక్కడికక్కడే మృతి

మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లారీని స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.