WGL: వర్ధన్నపేటలో నార్కోటిక్ పోలీసుల తనిఖీల్లో ఇవాళ భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కారును సీజ్ చేసి, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
వర్ధన్నపేటలో భారీ గంజాయి పట్టివేత


