హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటిలింగాల స్వామిని దర్శించుకున్న భోగ శ్రావణి

JGL: బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ భోగ శ్రావణి కుటుంబ సమేతంగా కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వేద పండితులు శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది.