హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రిప్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు గౌరీ శంకర్

NRPT: ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు గౌరీ శంకర్ అంతర్జాతీయ స్థాయి 1వ సౌత్ ఏషియన్ డ్రిప్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు భారత జట్టు తరఫున ఎంపికయ్యారు. నేడు నేపాల్‌లోని ఖాట్మండుకు బయలుదేరనున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న గౌరీ శంకర్ మంచి ప్రతిభ కనబరిచి దేశానికి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.