హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు పరిష్కరించాలని నిరసన

SDPT: బెజ్జంకి మండలంలో ఆటో డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. సోమవారం బస్టాండ్‌లో నిరసన చేపట్టి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. డ్రైవర్లకు నెలకు రూ.12 వేల సాయం అందించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని, ఉబర్ బైక్‌లను నిలిపివేయాలని కోరారు.