ప్రకాశం: కొండపి మండలం చోడవరం దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకరతో వెళుతున్న టిప్పర్ ముప్పవరం -చోడవరం గ్రామాల మధ్య ఉన్న మలుపులో అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి టిప్పర్ బోల్తా!


