హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఫీజు బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో బీజేపీ దీక్ష

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై BJP రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టింది. ‘ఫీజు బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో HYDలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం 10.30 గంటలకు దీక్ష ప్రారంభమై, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.