హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు నేత మల్లారెడ్డి మృతి

WGL: రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి (88) సోమవారం తెల్లవారుజామున తుడిశాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, రేపు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. నర్సంపేటకు చెందిన మల్లారెడ్డి.. అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా పనిచేసారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన రైతు సమస్యలపై పోరాటాలు చేసారు.