SDPT: హుస్నాబాద్ పట్టణంలో నిర్మితమవుతున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, నిర్మాణ నాణ్యత, ప్రమాణాలు, పనుల వేగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
తెలంగాణ
ఆసుపత్రి పనులను పరిశీలించిన మంత్రి


