హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నల్లవాగు ప్రాజెక్టుకు వరద

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టుకు 1,506 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈఈ మల్లేశం సోమవారం తెలిపారు. ఎగువన ప్రాంతం నుంచి వరద ప్రవాహం వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 746 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం 746 MCFT నీరు నిల్వ ఉందని తెలిపారు. అలుగు ద్వారా 1,360, కుడి, ఎడమ కాల్వల ద్వారా 146 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.