హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నరవలో జనసేన ఆత్మీయ సమావేశం

VSP: విశాఖలోని 88వ వార్డు నరవ గ్రామంలో సోమవారం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, జనసైనికుడు లింగం శ్రీనివాసరావుకు స్థానిక బాధ్యతలు అప్పగించారు. అనంతరం వీర మహిళలు జనసేన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుమారు 200 మంది జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.