హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాకు రానున్న గవర్నర్

NZB: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రేపు (మంగళవారం) నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో భేటీ అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశమై, డిచ్‌పల్లి మండలంలో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరవుతారు.