హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితిపై పోలీసుల అవగాహన

అన్నమయ్య: కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు పోలీస్ అనుమతి తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పందిర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత అధిక శబ్దం, DJలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.