ADB: ఇచ్చోడలోని ఆర్టీసీ బస్టాండ్ వర్షాలతో బురదమయంగా మారింది. ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవడంతో బస్టాండ్ సమీపంలో వరద నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు బస్టాండ్‌లోకి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఇచ్చోడ బస్టాండ్ బురదమయం


