హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశేష అలంకరణలో భద్రకాళి అమ్మవారు.. భక్తుల పూజలు

WGL: శ్రావణ మాసం సోమవారం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులు తెల్లవారుజామున విశేషాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని నూతన వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.