హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల వేటలో జాక్‌పాట్.. వలలో 28 కిలోల చేప

KNR: ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు నీటి విడుదల నిలిచిపోవడంతో గంగాధర మండలంలోని పలు గ్రామాల మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. ఆదివారం హిమ్మత్నగర్‌కు చెందిన మత్స్యకారుడు రాజేశం వలలో ఏకంగా 28 కిలోల బొచ్చె చేప చిక్కింది. దీంతో రాజేశం ఆనందం వ్యక్తం చేశారు. పలు గ్రామాల మత్స్యకారులు ఉత్సాహంగా చేపల వేట సాగిస్తున్నారు.