హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

కోనసీమ: రామచంద్రపురం మండలం బాలాంతరం గ్రామంలో అధికారులు సకాలంలో స్పందించి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. 15 ఏళ్ల  బాలికకు, 36 ఏళ్ల వ్యక్తితో ఈ నెల 26న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు నాగమానస, గంగ సూర్యనారాయణ, పోలీసు సిబ్బంది కలిసి వివాహాన్ని నిలిపివేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.