తిరుపతి జిల్లా చిన్నగొట్టు గల్లు మండలం తుమ్మచేను పల్లి సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రైతులు పొలాలకి వెళ్ళేటప్పుడు ఒంటరి కాకుండా గుంపులుగా వెళ్లాలని కోరారు. ఏనుగు కనిపించిన వెంటనే దాని దగ్గరకు వెళ్లకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండలంలో ఒంటరి ఏనుగు సంచారం


