ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు కొమ్మలపాడు గ్రామాల మధ్య సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహం లారీలో ఇరుక్కోవడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి లారీ బోల్తా.. ఒకరు మృతి


