ATP: ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కర్ణాటకలోని ఇమరాపురం వద్ద వరినాట్లు వేయడానికి ఆదివారం ఆటోలో వెళుతుండగా చెరకుంట-అసుండి గ్రామాల మధ్యన బళ్లారి హైవేలో ఆటో టైరు పేలింది. ఈ ప్రమాదంలో ఆటో డివైడర్‌ను ఢీకొని పది మంది కూలీలు తీవ్రగాయాల పాలయ్యారు. వారిని స్థానికులు వెంటనే 108 వాహనంలో బళ్లారి విమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూలీల ఆటో బోల్తా.. తీవ్ర విషాదం


