VZM: డెంకాడ మండలంలోని పెదతాడివాడ నుంచి గుండాలపేట మీదుగా చింతలవలస, రఘుమండ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో నిత్యం ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డంతా గుంతలే.. వాహనదారులకు తిప్పలే..!


