హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

NGKL: జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఉర్కొండలో 48.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కల్వకుర్తి మండలంలో 37.5 మి.మీ., నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో 36.5 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.