హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు

GNTR: మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్లాక్ మార్కెట్ దందా పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మూడు నెలల క్రితం రూ.42 ఉన్న పంచదార ధర ఇప్పుడు రూ.64కు చేరింది. పది కిలోల బియ్యం రూ.550 నుంచి రూ.750కి ఎగబాకగా, 26 కిలోల బస్తాపై అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు భారం పడుతోంది. అదనపు భారంతో  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.