హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మెగా జాబ్ మేళా

AKP: కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రభుత్వ హైస్కూల్‌లో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు APSSDC జిల్లా అధికారి పి.రోహిణి తెలిపారు. సుమారు 16 బహుళజాతీయ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, PG చదివి, 18-40 ఏళ్ల వయసున్న యువతీ యువకులు అర్హులు. సర్టిఫికెట్లు, తమ రెజ్యూమ్ పట్టుకొని 9 గంటలకు హాజరుకావాలని ఆమె తెలిపారు.