హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి

ATP: శెట్టూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. SC బాలుర వసతి గృహం పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల ప్రహరీ గోడ కూలి  హర్షవర్ధన్ (12) మృతి చెందాడు. ఆదివారం హర్షవర్ధన్, అక్షయ్ కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా.. ఈదురుగాలులకు ప్రహరీ గోడ కూలి వీరిపై పడింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హర్షవర్ధన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.