BDK: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి


