NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1079.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 44.489 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24గంటల్లో సగటున 2,894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. జూన్ 1నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.620 టీఎంసీల నీరు చేరగా, 6.398 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన నీటిమట్టం


