హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ డ్యామ్ అప్డేట్ వివరాలు

SRD: పుల్కల్ మండలం సింగూరు డ్యామ్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 515.460 మీటర్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఎగువ ప్రాంతాల నుంచి సగటున 923 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.564 టీఎంసీలుగా ఉంది.