హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సరఫరాకు అంతరాయం

SKLM: ఎలమంచిలి మున్సిపాలిటీకి ప్రధాన మంచినీటి వనరైన సోముడేవపల్లి RWS హెడ్ వాటర్ వర్క్స్‌లోని ఏడు సబ్‌మెర్సిబుల్ మోటార్లలో రెండు పనిచేయకపోవడంతో నీటి పంపింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో సోమవారం ఉదయం ధర్మవరం ప్రాంతానికి నీటి సరఫరా జరగదని మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు.