హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన చౌడమ్మ

NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అమ్మవారిని పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడుతోంది.