హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్రవన్నూరు వద్ద చిరుత కలకలం

ATP: రాయదుర్గం మండలం వడ్రవన్నూరు సమీపంలోని నల్లతిప్ప ప్రాంతంలో ఆదివారం చిరుత కనిపించడంతో స్థానిక ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో రెండ్రోజులుగా సంచరిస్తున్న చిరుతను చూసి రైతులు కేకలు వేయడంతో అది కొండల్లోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.