హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PDPL: గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్, రాహుల్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఈస్ట్ ఏఈ జమీల్ పాషా తెలిపారు.