హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

KKD: తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి(35) మృతి చెందాడు. నామవరం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తుని నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని SI సత్తిబాబు తెలిపారు.