హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు సోమవారం ఉదయం 10 గంటలకు జొన్నవలస - పినవేమలి రహదారి అభివృద్ధి పనులకు జొన్నవలస గ్రామంలో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30 గంటలకు వారి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా 16 మంది లబ్ధిదారులకు వచ్చిన చెక్కులను పంపిణీ చేయనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి.