హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలకు కొత్త కమిటీలు

E.G: రాజానగరం మండల వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి జక్కంపూడి రాజా తెలిపారు. యువజన విభాగం అధ్యక్షుడిగా పాలచర్లకు చెందిన పిల్ల లక్ష్మీనారాయణ, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా దివాన్చెరువుకు చెందిన మందాల వెంకటేష్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. అనుబంధ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.