హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NTR: మైలవరంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్వడం గ్రామానికి చెందిన వంశీకృష్ణ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సజ్జపాడుకు చెందిన సత్తిబాబు రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.