హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సత్రం స్థలం లీజు వేలంపాట

VSP: భీమిలి బీచ్ రోడ్డులోని దేవాదాయశాఖకు చెందిన లార్డ్ రిప్పన్పూర్ హౌస్ సత్రం స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు సోమవారం ఉదయం 10 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈవో తమ్మినేని పద్మ తెలిపారు. మూడేళ్ల కాలానికి నెలవారీ అద్దె ప్రాతిపదికన స్థలాన్ని లీజుకివ్వనున్నారు. ఆసక్తి గలవారు రూ. లక్ష డీడీతో వేలంపాటలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 8500274589 సంప్రదించాలని కోరారు.