హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుకు గురైన రైతు

KRNL: ఆదోని మండలం గనేకల్‌కు చెందిన రైతు రామంజి ఆదివారం పొలంలో సేద్యం చేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.