GDWL: ఇటిక్యాల మండల పరిధిలోని వావిలాల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా మురుగు నీటిని తొలగించకపోవడంతో ఇళ్లలోకి దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వాపోయారు. తక్షణమే కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అద్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ


