హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడి సంద్రంలో మునిగిన మత్స్యకారుల బోటు

VSP: విశాఖ సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మెకనైజ్డ్‌ బోటులోకి నీరు చేరడంతో నడిసంద్రంలో పూర్తిగా మునిగిపోయింది. అప్రమత్తమైన తోటి మత్స్యకారులు యజమాని అప్పలరాజుతో సహా ఐదుగురు సిబ్బందిని రక్షించి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు.