హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ స్టేషన్ తుది జాబితా ప్రచురణ

కృష్ణా: గుడ్లవల్లేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు సంబంధించిన తుది పోలింగ్‌ స్టేషన్ల జాబితా ప్రచురణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాను ప్రజల పరిశీలనార్ధం ప్రచురించినట్లు డిప్యూటీ ఎంపీడీవో అంజనా దేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.