AKP: అనకాపల్లి కలెక్టరేట్‌లో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఆర్వో వై.సత్యనారాయణ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ప్రకాశం పంతులు ధైర్యం, నిబద్ధత నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రకేసరి ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం: డీఆర్వో


